Listen to this article

జనం న్యూస్ 04 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తంచేశారు.ఈ మేరకు విజయవాడలోని సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ సెక్రటరీ యువరాజ్‌ని కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చక్కెర కర్మాగారాల పట్ల తన వైఖరి స్పష్టం చేయాలని కోరారు.చక్కెర రైతులకు, కార్మికులకు న్యాయం చేయాలన్నారు.