

జనం న్యూస్ జూన్ 4,
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం, నాణ్యమైన విత్తనం రైతులకు నేస్తం అనే వినూత్న కార్యక్రమం ప్రారంభం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో విస్తృతంగా అమలు పంట సాగులో నాణ్యమైన విత్తనం యొక్క పాత్రను గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేపట్టింది వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పూడూర్ మండల రైతులకు పంపిణీ ప్రారంభించారు. పూడూరు మండలంలోని గ్రామానికి ఇద్దరి చొప్పున ఒక బ్యాగు వరి ఒక బ్యాగు,కంది ఒక బ్యాగు పంట విత్తనము పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుప్రియ శాస్త్రవేత్త వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్, పరిగి వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీమతి లక్ష్మి కుమారి, పూడూరు మండల వ్యవసాయ అధికారి తులసిరామ్, మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
