Listen to this article

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య

భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హత పథకం అర్హులు ఉపాధి హామీ పని ఏడాదికి కనీసం 20 రోజులు పని చేయాలని నిబంధనలను వెంటనే ప్రభుత్వం తొలగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో జరిగిన గ్రామసభలో ఎంపీఓ దారా శ్రీనివాస్ కు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు,వ్యవసాయ కూలీలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా 20 రోజులు పని పొందిన కుటుంబాల ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ ఆధారంగా 12 వేల రూపాయల పథకానికి ఎంపిక చేస్తామని ప్రభుత్వం నిబంధనలు పెట్టడం సమంజసం కాదన్నారు. ఆ నిబంధనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వ్యవసాయ కూలీలు తదితరులు పాల్గొన్నారు