


సిసిహెచ్ శిక్షణా కార్యక్రమంలో లో మండల విద్యాశాఖ అధికారి వై. సూర్యనారాయణ
జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) జూన్ 5
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీఎం పోషన్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం స్థానిక శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి వై. సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన ఆయాలకు తగు సూచనలను అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎంత శుభ్రంగా వెళ్తామో పాఠశాలకు వచ్చేటప్పుడు కూడా అంతే శుభ్రతతో రావాలని ఆయాలకు ఆదేశించారు. విద్యార్థులకు శుచి-శుభ్రతతో భోజనాలు వడ్డించాలని అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు మాట్లాడుతూ రక్తహీనత, డీహైడ్రేడ్ నివారణ కొరకు ప్రభుత్వం రాగిజావను సరఫరా చేస్తుందని విద్యార్థులకు సకాలంలో అందచేయాలని ఆయాలకు సూచించారు. రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారిని ఎ.సరోజిని మాట్లాడుతూ ఆహార పదార్థాల తయారీలో వాటిని వడ్డించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. భోజన ఆవరణను పరిశుభ్రంగా ఉంచడం, విద్యార్థులు పాటించాల్సిన పరిశుభ్రతల గురించి వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు అందించే ఆహారం శుభ్రంగా, రుచిగా పౌష్టికాహారంతో కూడిన విధంగా ఉండాలని, పాఠశాలలో అందించే భోజనం మెనూ ప్రకారం నిర్వహించాలన్నారు. .ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు వల్లూరి శ్రీనివాసు, మధ్యాహ్నా భోజన కార్మికుల ట్రైనీ చిక్కాల పార్వతి, శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విప్పర్తి శాంతి సునీత, ఎస్ఎంసి చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు(చిన్ని), బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ పి ఆర్ ఓ అంగరవెంకట్, వైద్య సిబ్బంది హెచ్ఏ లు టి.ఇమ్మానుయేలు, డి.మురళీకృష్ణ,సి ఆర్ ఎం టి లు వై.ఎల్.వీర్రాజు, కిలపర్తి.పోసి రాములు, కుంచి.నీనా శిరి,వాసంశెట్టి సీతా ధనలక్ష్మి, రాయవరం మండలంలోని ఆయా గ్రామాల ఎండిఎం ఆయాలు పాల్గొన్నారు.