Listen to this article

జనం న్యూస్, జూన్ 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

జగదేవపూర్ మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద స్థానిక గ్రామ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కబడ్డీ ప్లేయర్ బాలకృష్ణ జన్మదిన వేడుకలు గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శాలువతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ శాఖ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగరాజు, కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ కనకయ్య, మాజీ వార్డు సభ్యులు మహేష్, గణేష్, హలీం, స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఇస్మాయిల్, అడ్డు, మచ్చబాబు, బచ్చలి భాస్కర్, దండే భాస్కర్, తోటి కబడ్డీ మిత్రులు హరి, కార్తీక్, శ్రీను,సన్నీ, తదితరులు పాల్గొన్నారు.