

జనం న్యూస్ జూన్ 5 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రంలో అధిక జనాభా గల మున్నూరుకాపులకు పేరుకుచివర పటేల్ గెజిట్ కోసం మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ నేతృత్వములో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ఫోరం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అత్యధిక సంఖ్య గల మున్నూరు కాపులకు పేరుకు చివరన ఒక గుర్తింపు ఉండాలని పటేల్ గెజిట్ మంజూరుతో మున్నూరుకాపుల హక్కులకు చట్టబద్ధ గుర్తింపు లభించడంతో పాటు, రక్షణకు న్యాయమూర్తుల ముందు, ప్రభుత్వ వ్యవస్థల ముందు బలమైన ఆధారంగా నిలుస్తుందని తెలిపారు. ఇది మాకు చారిత్రాత్మకమైన విజయంగా నిలుస్తుందని తెలిపారు. పటేల్ గెజిట్‌ను త్వరితగతిన మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను స్టేట్ కో ఆర్డినేటర్ దాదె వెంకట్ కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించారని తెలిపారు. పటేల్ యూత్ ఫోర్స్ ఏర్పడి గత రెండు సంవత్సరాలుగా పటేల్ గెజిట్, అన్ని జిల్లాల్లో బాలబాలికల హాస్టల్ అనే నినాదంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ వినతి పత్రం ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి కార్యచరణ రూపొందించి గేజిట్ జారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసాల బాలరాజు,పగడాల వెంకటేష్ పాల్గొన్నారు