Listen to this article

జనం న్యూస్ జనవరి 23 శాయంపేట మండలం ప్రభుత్వం నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరికి అమలుకు చర్యలు తీసుకుంటామని స్థానిక తహసీల్దార్ కాల్వల సత్యనారాయణ తెలిపారు ప్రభుత్వం పథకాల అమలులో భాగంగా మండలంలోని మైలారం జోగంపేల్లి ఆరేపల్లి గట్లకానిపర్తి హుసేన్ పల్లి కొత్తగట్టుసింగారం లో ప్రారంభమైన ప్రజాపాలన గ్రామ సభలో తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ అత్యీయ భరోసా రేషన్ కార్డులు రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో విడుదల చేస్తున్నామరు అర్హులై ఉండి పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని తెలియజేశారు ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు అర్హులైన వారు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు….