Listen to this article

జనంన్యూస్. 05.సిరికొండ. ప్రతినిధి.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని వెనుకబడిన ప్రాంతం. సిరికొండ 532,గడ్కోల్ 101,102, హాస్సేన్ నగర్ 836 భూముల సమస్యలను పరిష్కరించాలి.సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ జిల్లా నాయకులు ఆర్. రమేష్ డిమాండ్ చేశారు.భూభారతిని వృధా భారతి చెయ్యొద్దని, భూభారతి ధ్వారా కాలయాపన లేకుండా భూముల సమస్యలను పరిష్కరించాలని,సిరికొండ మండల కేంద్రంలో రైతువేదిక భవనంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సు లో సిరికొండ, గడ్కోల్, హుస్సేన్ నగర్ భూములకు సంబందించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు:సిరికొండకు చెందిన 532 సర్వే నంబర్ లో సర్వే చేసి రెవెన్యూ భూమిగా గుర్తించి 200 మంది లబ్ధిదారులకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో 2009సంవత్సరంలో పట్టాలు ఇచ్చారని, గడ్కోల్ లో 101,102 సర్వేనెంబర్ రెవిన్యూ భూలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఇప్పటికి కబ్జాలు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. 836 సర్వేనెంబర్ లో హుస్సేన్ నగర్ గ్రామస్తులు నిరుపేదలకు కబ్జాలో ఉన్న పట్టాలు ఇవ్వడం లేదు అంన్నారు. అటవీశాఖ అధికారులు ఇట్టి భూమి ఫారెస్ట్ భూములని పేదల సాగు చేయకుండా అడ్డుకుంటున్నారు. పదేపదే ఆందోళనలు చేసిన, భూమి చదును చేయడానికి పూనుకుంటుంటే అటవిశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. హైకోర్టు ప్రత్యేకంగా లబ్ధిదారుల భూమి లోకి ఆటో శాఖ అధికారులు పోకూడదని అట్టి భూమి లబ్ధిదారులకు చెందుతుందని తీర్పును కూడా ఇచ్చింది అయినా అటవీశాఖ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం మూలంగా లబ్ధిదారులు చూసి వేసరిపోయారు. అనేక దపాలుగా ఆందోళన చేసినప్పుడు హామీ ఇచ్చి మరిచిపోవడం మీ రెవెన్యూ అధికారులకు అలవాటుగా మారింది. పేదలు సాగు చేసుకుంటున్న భూముల విషయంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. 3సార్లుగా అటవీశాఖ, రెవిన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి రెవిన్యూ భూమి అని తెల్చిన ఫలితం లేదు పేదలపట్ల కనికరం లేదు.ఇప్పటికైనా తమరు జోక్యం చేసుకొని మీరు చేపట్టిన రెవిన్యూ సదస్సులో అయినా సమస్య పరిష్కరించి లబ్ధిదారులకే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేయారు.కార్యక్రమంలో డివిజన్, మండల నాయకులు ఆర్. దామోదర్, జి.సాయిరెడ్డి, ఇ. రమేష్, ఎం. లింబాద్రి, ఎస్. కిశోర్, ఎల్. గోపి, బి.నాగయ్య, జి.గంగాధర్, ఎం. మోహన్, ఏ.రాజు
తదితరులు పాల్గొన్నారు.