

జనంన్యూస్ 05.సిరికొండ.ప్రతినిధి.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశానుసారం స్థానిక కాంగ్రెస్ నాయకులు. రావూట్ల గ్రామ యువజన విభాగం నాయకుడు బాజన్నగారి రమేష్. జిల్లా సెక్రెటరీ గొల్ల ఎర్రన్న. స్థానిక నాయకుల ఆధ్వర్యంలో. 20. మంది లబ్ధిదారులకు 650000 ఆరు లక్షల 50 వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం అందించి సహాయపడటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ముందు ఉంటుందని స్థానిక నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.