Listen to this article

జనం న్యూస్- జూన్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

పర్యావరణాన్ని పరిరక్షించడంలో అందరికీ బాధ్యత ఉంటుందని నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్ సెక్షన్ ఆఫీసర్ రమేష్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవo సందర్భంగా అటవీ శాఖ ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు గురువారం నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని అర్బన్ పార్క్ అటవీ ప్రాంతంలో పాటు పొట్టి చలమ సమీపంలోని సమ్మక్క సారక్క దేవాలయం నుండి నెల్లికల్ క్రాస్ రోడ్డు వరకు రోడ్డు ఇరువైపులా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలలోని ప్లాస్టిక్ సీసాలను, ప్లాస్టిక్ వస్తువులను ఏరివేశారు. దీంతోపాటు అర్బన్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్లాస్టిక్ ను వినియోగించడం వలన కలిగే నష్టాల గురించి మరియు పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు రవీందర్ రెడ్డి,సిహెచ్ రాములు, శేఖర్ రెడ్డి మరియు అటవీశాఖ సిబ్బంది, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.