

జనం న్యూస్;5 జూన్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; వై.రమేష్ :
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ఎస్టియు లక్ష్యమని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పర్వతరెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ అన్నారు. స్థానిక సిద్దిపేట పీఎస్ డబ్ల్యూఏ భవన్ లో ఈరోజు రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశమునకు రాష్ట్ర నాయకులు పర్వతరెడ్డి, సదానందoగౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరైనారు. సభాధ్యక్షులుగా సిద్దిపేట జిల్లా అధ్యక్ష-కార్యదర్శులు పట్నం భూపాల్, మ్యాడ శ్రీధర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ డబ్ల్యూఏ భవన్ పెద్దలు ఎస్. యాదగిరి, ఎస్. నాగభూషణం, అధ్యక్షులు అయిత అంజయ్య, కల్లేపల్లి శ్రీనివాస్, తోట మధుసూదన్, నీలకంటి మనోహర్ జిహెచ్ఎం లను రాష్ట్ర నాయకులు పర్వతరెడ్డి, సదానందంగౌడ్ లు ఘనంగా సన్మానించినారు. అదేవిధంగా 1990లో ఎస్టియు సంఘంలో కార్యకర్తగా చేరి 35 సంవత్సరాలు సంఘానికి సేవలు అందించినందుకు, ఈ మధ్యనే పదవి విరమణ పొందిన గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గడ్డం బాలకిషన్ ను ముఖ్య అతిథులు- పర్వతరెడ్డి, సదానందంగౌడ్ లు ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత మాట్లాడుతూ- ఎస్టియు సంఘంలో సభ్యునిగా మరియు పిఎస్ డబ్ల్యూఏ భవన్ లో జీవిత సభ్యునిగా 1990లో చేరిన నాకు ఇవి రెండూ కూడా కళ్ళలాంటివని అన్నారు, పీఎస్ డబ్ల్యూఏ ప్రస్తుత కార్యవర్గంలో జెయింట్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు, నాకు ఈ స్థాయి ఇచ్చిన పిఎస్ డబ్ల్యూ ఏ భవన్ గౌరవ సలహా మండలి సభ్యులు, ఎక్స్-అఫిసియో సభ్యులందరికీ పేరుపేరున సన్మాన గ్రహీత గడ్డం బాలకిషన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ సంఘం సిద్దిపేట జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన అధ్యక్ష- కార్యదర్శులు, ఎస్టీయూ సంఘం అభిమానులoదరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.