Listen to this article

జనం న్యూస్,జనవరి 23,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజా పాలన గ్రామసభను శుక్రవారం నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రావు, తెలిపారు.ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తుందని అన్నారు. రైతు భరోసా,ఆత్మీయ ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇల్లు,కొత్త రేషన్ కార్డ్,లను గ్రామాలలోని అర్హత కలిగిన వారికే అందించాలన్న సదుద్దేశంతో ప్రజా పాలన గ్రామసభలను నిర్వహిస్తుందని అన్నారు.ఈ సభకు గ్రామ సీనియర్ నాయకులు,యువజన సంఘాల నాయకులు, ప్రజలు,అందరూ హాజరు కావలసిందిగా తడ్కల్ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు.ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులై ఉండి మీకు ఆ పథకం రానట్టయితే ప్రజా పాలన గ్రామసభ ద్వారా అర్జీ చేసుకోవచ్చని అన్నారు. ప్రజలు పథకం మాకు అమలు కాలేదని దిగ్బ్రాంతి పడకూడదని ఏ పథకమైన పొందడానికి అర్హత కలిగి ఉంటే ప్రజా పాలన గ్రామసభలో ఆ పథకానికి సంబంధించిన అధికారిని అర్జీ చేసుకోవచ్చని అన్నారు.