Listen to this article

సంగారెడ్డి జిల్లా జనం న్యూస్ఎండ వేడిమితో చేపలు మృతి ఆందోల్ నియోజకవర్గం లో (జూన్ 7 జనం న్యూస్) సంగారెడ్డి జిల్లా, ఒక్కసారి వాతావరణం మారి ఎండలు మండడంతో ఆందోల్ పెద్ద చెరువులోని నీరు కాస్త అడుగంటి అందులో ఉన్నటువంటి చేపలు ఎండ వేడిమి తట్టుకోలేక చనిపోయిన సంఘటన అందోల్ మండలం అందోల్ పెద్ద చెరువులో జరిగింది, ఈ చెరువుపై ఆధారపడి మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి, ఒక్కసారిగా చేపలు మృత్యువాత పడడంతో మత్స్యకారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బొచ్చ, రవుటా, కొర్రమీను, హల్వా, సత్వ, ఇలా ఐదారు రకాల చేపలు పెంచడంతో, ఎండలకు, చెరువులో నీరు అడుగంటిపోయి లక్షల సంఖ్యలో చేపలు చనిపోయాయని, మత్స్యకారులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మత్స్యకారులను ఆదుకొని ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు….