Listen to this article

జనం న్యూస్ జూన్ 9 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీవే అవకాశం ఉంది.రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3గంటలుగా ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని గంటల్లో సిద్ధిపేట, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.పన్నెండు గంటలపాటు హైదరాబాద్‌లో హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీవే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో పన్నెండు గంటలపాటు అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.