

జనం న్యూస్ 10జూన్ పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగాతెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు నూతన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయడానికి ఈరోజు పెగడపల్లి మండలం నంచర్ల, లింగాపూర్,నరసింహునిపేటగ్రామాలలో ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ తో కలిసి ఎంపీడీఒ,ఎంపీఓ నూతనంగా నిర్మించే ఇంటికి మార్కింగ్ చేసి భూమి పూజ చేసి గృహ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నవీన్, లావణ్య, పద్మ హౌసింగ్ ఏఈ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సందీ మల్లారెడ్డి తడగొండ రాజు తిరుపతి ఏఎంసీ డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్ చెట్ల కిషన్ లింగంపల్లి మహేష్ శ్రీరామ్ అంజయ్య నాయకులు పూసల తిరుపతి కడారి తిరుపతి సింగసాని స్వామి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంటాల అంజయ్య లింగాల తిరుపతి సాయిల రాకేష్ కొత్తూరు విష్ణు వడ్కాపురం అనిల్ సూర అంజి బుర్ర అశోక్ క్రిస్టోఫర్ బొడ్డు రమేష్ కొత్త మధుకర్ మహేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు.