Listen to this article

జనం న్యూస్ జనవరి 23 అమలాపురం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం వారి ఆర్థిక సహాయంతో యూటీఎఫ్ వారు రూపొందించిన టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ ను కాదంబర సుందరమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కంచర్ల వెంకటరావు (బాబి), కోశాధికారి కంచర్ల కృష్ణమోహన్, ఉపాధ్యక్షులు పోసెట్టి సూరిబాబు, యు టి ఎఫ్ అధ్యక్షులు కె. రాజబాబు, ఏ ఎస్ ఎస్ అధ్యక్షులు ఏ దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె వి ఎస్ ఎన్ బాబు, సీనియర్ కార్యకర్త బి.రాచయ్య తదితరులు పాల్గొన్నారు