Listen to this article

జనం న్యూస్,జూన్10అచ్యుతాపురం:

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లారస్ కంపెనీ అడ్మిన్ భవనంలో కంపెనీలు యాజమాన్యంతో
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆధ్యాత్మిక కేంద్రాల్లో నిర్వహిస్తున్న యోగ సాధన కార్యక్రమాల్లో పాల్గొనాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 12న అచ్యుతాపురం సెజ్ లో నిర్వహించే జిల్లాస్థాయి మెగా యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, కార్మికులు,ఉద్యోగులు పాల్గొనాలని తెలిపారు.
జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ యోగ దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాసనసభ్యులు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,రాష్ట్ర.సీఎం చంద్రబాబు నాయుడు,
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర మంత్రులు,ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని అన్నారు. జిల్లా నుండి కనీసం 60వేల మంది హాజరు కావాలని, జిల్లాకు సంబంధించిన ప్రజలకు రూట్ మ్యాప్, కేటాయించిన స్థలం తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుందని, ప్రజలందరూ అక్కడికి స్వచ్ఛందంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.