

డాక్టర్ ఆదుముల్లా శృతి సింధనూరి
జనం న్యూస్,జున్ 10,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని శ్రీ సిద్ధి వినాయక క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్యత శిబిరాన్ని డాక్టర్ అదుముల్లా శృతి సిందునూరి మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ మహిళలలో అధికంగా పీరియడ్స్ ప్రాబ్లం, పౌష్టిక ఆహారాన్ని తీసుకోకపోవడం, అధికంగా బరువు ఎత్తడం వల్ల సంతానం కాకపోవడానికి ముఖ్య కారణాలని అన్నారు. పురుషులు అధికంగా మందు పిచికారి చేయడం వల్ల మందు చల్లడం వల్ల, శుక్రకణాల లోపం వల్ల లైంగిక సంబంధాన్ని సరియైన కలవవలసిన రోజుల్లో కలవక పోవడంతో సంతాన సాఫల్యత సాధించకపోవడానికి ముఖ్య కారణాలని అన్నారు. సంతాన సాఫల్యత చేకూరాలంటే స్త్రీ పురుషులు వైద్య పరీక్షలు చేయించుకోవలసి వస్తుందని అన్నారు. పరీక్షలు నిర్వహించిన పిమ్మట వైద్యుల సలహాలు సూచనలతో మందు మాత్రలు స్వీకరించినట్లయితే సంతాన సాఫల్యత పొందవచ్చని అన్నారు.
సంతాన సాఫల్యత అవగాహన కోసం ప్రతి 3 నెలలకి ఒకసారి ఉచిత వైద్య శిబిరo శ్రీ సిద్ధి వినాయక క్లినిక్ నందు నిర్వహిస్తామని అన్నారు వారితో పాటు క్లినిక్ యాజమాన్యo, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు