

ఏర్గట్లజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యారులకు క్రీడా దుస్తుల పంపిణీ*.
జనం న్యూస్ జనవరి 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నొల్ల శివకుమార్ మరియు కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ దేవేందర్ సంయుక్తంగా సుమారు 50 క్రీడా దుస్తులను విద్యార్థులకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసంతన వంతుగా బాధ్యత తీసుకొని సహాయపడతానని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని కోరారు.పాఠశాలకుమంచి గుర్తింపుతో మిమ్ములను గన్న తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరాడు. కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ఏదైనా అవసరాలు ఉంటే తూచ తప్పకుండా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేసిన శివకుమార్ మరియు దేవేందర్ నుపాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోపరేటివ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్ మరియు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.