

జనం న్యూస్ జూన్ 11 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మునగాల మండలం బరాకత్ గూడెం గ్రామంలో అంగన్‌వాడీ టీచర్లు మరియు హెల్పర్స్ ఆధ్వర్యంలో మంగళవారం అమ్మమాట -అంగన్‌వాడీ బాట కార్యక్రమం మరియు ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్వైజర్ బెజవాడ సరిత మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్‌వాడీ సెంటర్ ఆహ్వానించడం జరుగుతుందని.ప్లే స్కూల్ విద్య గురించి తల్లులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి దేవరం శ్వేత,వివోఏ భాగ్యమ్మ, ఆశ లక్ష్మి,ఏఎల్ఎంఎస్సి కమిటీ సభ్యులు,అంగన్‌వాడీ టీచర్లు సునీత, షేక్ షబాన్, సుధారాణి,తదితరులు పాల్గొన్నారు.
