Listen to this article

గజ్వేల్ లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు

జనం న్యూస్, జూన్ 11 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్యవైశ్య మహాసభ యువజన అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ జన్మదినం సందర్భంగా మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా అంగడిపేట హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి, దాదాపు 500 మందికి పులిహోర పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్, గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ, మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ జన్మదినం సందర్భంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో సిద్ది బిక్షపతి, అత్తెల్లి లక్ష్మయ్య,గంగిశెట్టి వెంకటేశం, గౌరీ శంకర్, కాశీనాథ్,ఉప్పల కృష్ణమూర్తి, అత్తెల్లి రాజేశం, కైలాస ప్రశాంత్, ఉమేష్, బల్లి నాగరాజు, సిద్దేశ్వర్, శ్రీహరి , ఉప్పల చంద్ర శేఖర్, గందే సంతోష్ తదితరులు పాల్గొన్నారు