Listen to this article

జనం న్యూస్ -జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ మూడో వార్డుకు సంబంధించిన గ్రామ సభను స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించారు ,ప్రతీ పేద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మూడవ వార్డు కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్ అన్నారు. కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు పథకాల అర్హుల జాబితా పై ప్రజా అభిప్రాయ సేకరణను చేపట్టారు. ఇందిరమ్మ గృహాలకు సంబంధించిన అప్లికేషన్స్ 80 నూతన రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ 61 వచ్చాయని తెలిపారు, అర్హులను ప్రజా సమక్షంలో ప్రజల చేత ఆమోదం చేయించి ప్రతీ పేద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.వార్డు ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందకూడదని .. కమిషనర్ దండు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది నిరంతర ప్రక్రియ అని జాబితాలో పేరు రాని వారు తమ దరఖాస్తులను అధికారులకు అందజేయాలని సూచించారు.ఒక ప్రణాళిక బద్ధంగా అందరికీ న్యాయం జరుగుతుంది అని అన్నారు..ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ కమిషనర్ దండు శీను, సూపర్వైజర్ అర్చన మూడవ వార్డు ఆఫీసర్ కళ్యాణి అనిత, ,అంగన్వాడి టీచర్ సుధా మరియూ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.