

నందలూరు మీడియా మిత్రులకు నమస్కారం🙏🙏
ప్రభుత్వ వైద్యశాలకు 1200 రక్త నమూనా ట్యూబులు పంపిణీ.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.23-01-25 రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నందలూరు ప్రభుత్వ వైద్యశాలకు రక్త కణాల నమూనా పరీక్షలు నిర్వహించే 1200 ట్యూబులను నందలూరు మండల సర్పంచు ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ శరత్ క మల్ కార్తీక్ విశ్వనాథ్ లకు అందజేశారు. దాదాపు ఆరు నెలల కు పైగా రోగులకు ఉపయోగ పడతాయని ప్రధానంగా రక్త నమూనా పరీక్షలు కణాల గుర్తింపు యూట్యూబ్లో ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు అన్నారు. నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రోగులకు ఉపయోగపడే విధంగా సహాయపడిన సర్పంచ్ జంబు సూర్యనారాయణ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని సర్పంచ్ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కానకుర్తి వెంకటయ్య తుమ్మాది శివకుమార్ పవన్ కుమార్ శివ నరసింహులు చామంచి పెంచలయ్య సుబ్బరాయుడు సిహెచ్ఓ వెంకటనారాయణ ల్యాబ్ టెక్నీషియన్ ఖాదరవల్లి ఎంహెచ్ఎన్ శైలజ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు