Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూన్ 11 :

పిల్లలను ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారం లో చేర్పించాలని సీనియర్ ఉపాధ్యాయులు టీం లీడర్ డిఎస్.నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు.ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. బడిబాట కార్యక్రమంలో భాగంగా మాల పోచారం ఉపాధ్యాయులు రెండు టీములుగా విడిపోయి ఏన్కూరు మండలం పరిధిలోని వివిధ గ్రామాలను 8, 9, 10, 11 తారీఖులలో విస్తృతంగా పర్యటించి విద్యార్థుల నమోదుకు కృషి చేశారు.ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ విద్యార్థులను చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా టీం లీడర్ డిఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు గురించి తెలియజేశారు.మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ మోజులో పడి ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించాలని వారు కోరారు.ఆశ్రమ పాఠశాలలో ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, లేబరేటరీలతో పాటు, ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో, అనుభవజ్ఞులైన, నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందని, పిల్లల మానసిక ఆరోగ్యానికి వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ఆశ్రమ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని తెలియజేశారు.ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు,ట్రంక్ బాక్స్, నాలుగు జతల బట్టలు, షూస్, బెల్ట్, ఉదయం అల్పాహారం,రెండు పూటల భోజనం, వారానికి ఐదు అరటి పండ్లు, ఐదు కోడిగుడ్లు, నెలకు నాలుగు సార్లు చికెను, రెండుసార్లు మటన్ తో,సాయంత్రం స్నాక్స్, పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తారని తెలియజేశారు.కావున విజ్ఞులైన తల్లిదండ్రులు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో మీపిల్లలను చేర్చించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని వారు పిలుపునిచ్చారు.బడిబాట కార్యక్రమంలో బి.శోభన్ నాయక్ కే.శ్యామల ఎం. చందర్రావు, ఎన్.శ్రీరామ్, పి. శ్రీనివాస్,వి.రమేష్, బి.సింగ్య,జె.నాగేశ్వరరావు, బి.రవి,డి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.