

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 23 (జనం న్యూస్): ప్రకాశం జిల్లా: కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామం నందు విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములను కేంద్ర విమానయాన సంస్థ మరియు జిల్లా అధికారులతో కలసి బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ,ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. వారి వెంట జిల్లా రెవిన్యూ అధికారులు కూడా ఉన్నారు. ఒంగోలు విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో వేగంగా అడుగులు పడుతున్నాయి.