

జనం న్యూస్ జూన్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
తెలంగాణ రాష్ట్ర మంత్రి గా ఎంపికైన గడ్డం వివేక్ వెంకటస్వామి నీ బుధవారం హైదరాబాద్ లో భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు రాష్ట్ర మంత్రికి పుష్ప గుచం అందించి శాలువాతో ఘనంగా సన్మానించి,శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకవెళ్లారు,గుండి,అప్పపల్లి వాగులపై వంతెన నిర్మాణపనులను వేగవంతం చేయాలన్నారు,అలగే జిల్లా కేంద్రంలోని సాయి బాబా ఆలయం నుండి బైపాస్ వరకు రోడ్డు మంజూరు చేయించాలన్నారు,ఇలాగే పలు సమస్యలను వారి దృష్టికి చూసుకవెళ్లారు,సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి త్వరలోనే కృషి చేస్తానని అన్నారు,గతంలో టిఆర్ఎస్,బిజెపి పార్టీలో కలసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు