

త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానంలో క్షర అక్షర పురుషోత్తమ వివరం తెలుసుకొని ఆచరించాలి.
ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి.
జనం న్యూస్ 11 జూన్ 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్)
త్రైత సిద్ధాంతం ప్రబోధా సేవ సమితి ఇందు జ్ఞాన వేదిక ఎల్కతుర్తి కమిటీ సభ్యులు ఇందు శ్రీ శివ నారాయణ సింగ్ ఇందు శ్రీ రేవతి వరంగల్ పోచం మైదాన్ పరిధిలోని దేశాయిపేట స్వగృహంలో శ్రీకృష్ణుని పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ. శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించినటువంటి 101 దైవ గ్రంథాలు జ్ఞానము ప్రతి మానవుడు తెలుసుకొని దైవ జ్ఞానాన్ని ఆచరించి ప్రతి మనిషికి చివరి గమ్యమైనటువంటి మోక్షాన్ని పొందాలని తెలియజేస్తూ దైవ జ్ఞానం ప్రకారం కులాలు అహేతుకం అని మతాలు నిషిద్ధం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అన్నారు. త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథం శ్రీకృష్ణుడి అసలైన జ్ఞానమును తెలియజేస్తుందనీ ప్రతి ఒక్కరు కర్మయోగం విశిష్టత తెలుసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవాన్ వారి పూజ సత్సంగం నిర్వహిస్తున్నామని అన్నారు. మన శరీరంలో దేవుడు మూడు ఆత్మలుగా విభజింపబడి ఉన్నాడని. జీవాత్మ, ఆత్మ, పరమాత్మల,గురించి తెలుసుకోవడమే త్రైత సిద్ధాంతం అని తెలిపారు. భగవద్గీతలో కర్మయోగం. బ్రహ్మయోగం భక్తియోగం అనేవి దైవ ధర్మాలు అని వాటి ప్రకారం నడుచుకుంటే కర్మ నుండి బయటపడేసి మనిషికి ముక్తిని ఇస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. పూజ అనంతరం అందరికీ తీర్థ ప్రసాదాలు భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రబోధా సేవ సమితి ఇందు జ్ఞానవేదిక ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి, కమిటీ సభ్యులు, వెంకట్,రాకేష్ , సిద్ధార్థ్, ఆశ్రిత, క్షేత్రజ్ఞ, రాణి, జ్యోతి, రేవతి, స్రవంతి, శ్రీలత, తనూష, దివిజ, రిసాన్, మోక్షజ్ఞ, భక్తులు దైవజ్ఞాన శ్రీ కృష్ణ భగవాన్ పూజ సత్సంగ కార్యక్రమములో పాల్గొన్నారు