Listen to this article

జనంన్యూస్. జూన్ 11,సిరికొండ. ప్రతినిధి.

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిన్న వాల్గోట్ గ్రామం నుండి న్యావనంది వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మార్గమధ్యంలో ఉన్న వంతెనలు పగిలిపోయిన పాత రాళ్లతో నిర్మించబడి ఉండగా, ప్రస్తుతం వర్షాకాలం కారణంగా రోడ్లు పూర్తిగా గుంతలతో నిండి ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి వంతెనలపై నీరు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రతీ రోజు విద్యార్థులు, రైతులు, పౌరులు ఈ మార్గాన్ని ప్రయాణిస్తూ ప్రాణాలతో ఆటలాడుతున్నారు. వర్షాల సమయంలో వాగులు పొంగి వంతెనలు పూర్తిగా నీటితో మునిగిపోతే గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి వంతెనలకు, రోడ్లకు మెరుగైన మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు గమ్యమైన సురక్షిత మార్గాన్ని అందించాలనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.