

కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ , విధుల్లో అలసత్వం వహిస్తున్న DEO మాణిక్యాలనాయుడు గారిని సస్పెండ్ చేయాలి – SFI
జనం న్యూస్ 12 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
నిర్మాణాలను పూర్తి అవకుండా అడ్మిషన్లు చేస్తున్న ప్రదీప్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల ను సీజ్ చేయాలని కోరుతూ SFI విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు D రాము , Ch వెంకటేష్ లు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ విద్య బలోపేతం చేయడం మానేసి కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. రేపటి నుండి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నా శ్రీ చైతన్య పాఠశాల నిర్మాణ దశలోనే ఉంది అని అయినా సరే పాఠశాల యాజమాన్యం అడ్మిషన్స్ నిర్వహిస్తూ , పుస్తకాల వ్యాపారం కూడా చేస్తుందని విమర్శించారు. పాఠశాలలో కరెంట్ వైర్లు ఓపెన్ గానే ఉన్నాయని రేపు విద్యార్థులు వచ్చి వారికి ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని దుయ్యబట్టారు. లిఫ్ట్ కూడా నిర్మాణ దశలో ఉందని వారిలో పిల్లలు పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. దానితో పాటు వాటర్ సదుపాయం కూడా లేదని తెలిపారు. పాఠశాల మొత్తం బయట పెద్ద ఇంద్రభవనం లా ఉన్న సరే లోపల మాత్రం మొత్తం డొల్ల లానే ఉందని తెలిపారు. కనీసం ఆసరా కోసం వేసినా కర్రలు కూడా బిల్డింగ్ కి కట్టి అలా ఉందని విమర్శించారు. పాఠశాలలో పుస్తకాల వ్యాపారం యథేచ్ఛగా ఉందని విమర్శించారు. దీనిని అడ్డుకోవాల్సిన DEO మణిక్యాలనాయుడు గారు కనీసం స్పందన లేకుండా ఉన్నారని విమర్శించారు. ఇప్పటిక్ జిల్లాలో 10 చోట్ల పుస్తకాలు అమ్మకాన్ని SFI ఆధ్వర్యంలో పట్టుకుంటే ఒక్క చోట కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదని విమర్శించారు. అంటే కార్పొరేట్ యజమాన్యాలకి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. ఇటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ , అవినీతి చర్యలకు పాల్పడుతున్న DEO మణిక్యాలనాయుడు గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ అంబెడ్కర్ గారు స్పందించి విద్యార్థుల ప్రాణాలను కాపాడే విధంగా నిర్మాణాలు పూర్తి అవ్వకుండా అడ్మిషన్స్ చేసి తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల నిర్వహణను అడ్డుకోవాలని కోరారు. నిర్మాణాలు పూర్తి అయిన తరువాతే తరగతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు నష్టం చేసే విధంగా పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని దానికి జిల్లా విద్యా శాఖాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. పాఠశాల ఎదుట పుస్తకాలతో SFI నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా ఉపాధ్యక్షులు వ్. చినబాబు , జ్.రవి కుమార్ , జిల్లా సహాయ కార్యదర్శి ప్.రమేష్ , ఎ.వంశీ , శిరీష మరియు నాయకులు యర్రమ్మ , గుణ , మురళి తదితరులు పాల్గొన్నారు.