Listen to this article

జనం న్యూస్ జనవరి 23( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి లో ప్రజాపాలన గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,
యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బైరం రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు దార మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా 6 గ్యారంటీలు అమలు చేస్తుందని అందులో భాగంగా గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగిందని, అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకొని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయడం, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది అని, ఇది నిరంతర ప్రక్రియ అని, గత బిఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, నిరుపేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఎమ్మార్వో శ్రావణ్, గ్రామ సెక్రటరీ, నాయకులు మల్లేశం,రామారావు దామనమైన నర్సింలు, బైరం సంగీత, గజ్వేల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కొప్పు రాజు, రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దావు కిషన్ యాదవ్, ప్రభాకర్ బైరం కరుణాకర్, తుమ్మ స్వామి, గోపాల్, బైరం రాజు, బైరం మహేష్.,దాసరి రాజు,.కరుణాకర్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు