

జనం న్యూస్ జనవరి 23 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి లో గురువారం 128 వ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు గ్రామ తాజా మాజీ సర్పంచ్ మంజుల శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించారు స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం మాజీ వైస్ ఎంపీపీ మంద బాలారెడ్డి మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్, తీగుల్ మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ మాట్లాడుతూ అందరికీ సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు, యువతకు ఆదర్శం సుభాష్ చంద్రబోస్ అని భారతదేశ స్వాతంత్ర సంగ్రామం లో ముఖ్య భూమిక పోషించిన సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేటి యువత సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను చదువుకోవాలని, మరణం లేని నేతగా సుభాష్ చంద్రబోస్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నేత అని గణేష్ పల్లిలో ప్రతి సంవత్సరం సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త,అంగడి కిష్టాపూర్ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీ రాములు గౌడ్, గణేష్ పల్లి మాజీ ఉపసర్పంచ్ మహేష్,నాయకులు రామరాజు,గోవర్ధన్,నాగరాజు,యాదగిరి,కనకయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు