

జనం న్యూస్ జనవరి 23 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ ):- సిద్దిపేట జిల్లా ప్రజా సమస్యలు వెళ్లబుచ్చుకుందామని వచ్చిన బాధితులకు కనీస వసతులు ఉండవు,కనీసం వికలాంగులు మహిళలు వస్తే కూర్చోవడానికి కుర్చీలు త్రాగడానికి మంచి నీరు కూడా ఉండవని కానీ అధికారులు మాత్రం ఎంపీడీవో కార్యాలయంలో లోపల వాహనాలు నిలుపుకోవడం దారుణమైన సంఘటన అని మండల ప్రజలు అంటున్నారు. మర్కుక్ మండల ఎంపీడీవో కార్యాలయం లోపల అధికారులు రెండు రోజులుగా వాహనాన్ని అందులోనే ఉంచారు. ఇంతటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం ఎంతవరకు సమంజసము ఆ అధికారులకే తెలియాలని అంటున్నారు. దీనికి గాను కార్యాలయాన్ని సందర్శించిన వ్యక్తులు మాట్లాడుతూ సమస్యకు దరఖాస్తు ఇస్తే అది లేదు ఇది లేదు అని సాకులు చెప్పి తిప్పించుకోవడం, ఏదైనా సమస్య వుందని చెప్తే ఒళ్లంతా గర్వంతో మాట్లాడడం తెలిసే అధికారులకు, ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన నియమాలు తెలియవా అని అంటున్నారు. ప్రజలు నో పార్కింగ్ లో వాహనాలు నిలిపితేనే ఫైన్ లు వేసే ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయం లోపాల వాహనాలు నిలపడం న్యాయమేనా అని మండల ప్రజలు అంటున్నారు.