Listen to this article

జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికిడివైఎఫ్ఐ నాయకుల వినతి

జనం న్యూస్ జూన్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆసిఫాబాద్ జిల్లాలోని జలపాతాలు మరియు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి కొరకు నిధులుమంజూరు చేసి అభివృద్ధి చేయాలి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గేడం టికనంద్ గొడిసెల కార్తీక్ అన్నారు, జిల్లావ్యాప్తంగా చాలా జలపాతాలు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి వాటికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేసి దాని ద్వారా పారాటకులు ఎక్కువమంది వచ్చే అవకాశం ఉంది మరియు జిల్లాకు ఎక్కువగా రాబడి పెరుగుతుంది అన్నారు కొంత అభివృద్ధి అవ్వటానికి అవకాశం ఉంటుంది అని అన్నారు, చింతల మాదాల జలపాతం ఉల్లిపిట్ట సంతుల గుండం మరియు గుండాల జలపాతం వాంకిడి మండలంలోని జలపాతాలు వాటితో పాటు పర్యటక కేంద్రాలు ఆడ ప్రాజెక్ట్ మర్లవాయి జోడేఘాట్ ప్రాణహిత ప్రాజెక్ట్ వంటివి జిల్లాలో ఉన్నాయని వాటిని అభివృద్ధి చెయ్యక చాలామంది పరాటకులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలం కావున జలపాతాలను దృష్టిలో పెట్టుకొని త్వరలో మహిళల కొరకు ప్రత్యేక గదులు మరియు మూత్రశాలలు ఏర్పాటు చేసి పర్యటకులకు అన్ని విధాలుగ సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మరియు జలపాతాల చుట్టూ ప్రత్యేక కంచెలు ఏర్పాటు చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాము వాటితో పాటు ప్రత్యేక నైట్ వాచ్మెన్ ఉండేటట్లు చూస్తాము అన్నారు మరియు జిల్లా ఫారెస్ట్ అధికారులుతో మాట్లాడి అభివృద్ధి చేసేలా చూస్తామని మరియు జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి ప్రత్యేక పర్యవేక్షణ ఉండేటట్లు చూస్తామని రాత్రిపూట వాచ్మెన్ ఉండేటట్లు చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గేడం టికనంద్ గోడిసెల కార్తీక్ జిల్లా ఉపాధ్యక్షురాలు చాపిడి శ్రావణి తదితరులు పాల్గొన్నారు