

జనంన్యూస్. 13. సిరికొండ.ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని.సిరికొండ మండల కేంద్రంలోగల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు. విద్యా కమిటీ చైర్మన్ , గ్రామ ప్రముఖులు ఆసిఫ్ మరియు దర్పల్లి బాబురావు పాల్గొన్నారు. వీరు విద్యార్థులను ఉద్దేశించి,”పాఠ్య పుస్తకాలు మాత్రమే కాదు – మీ భవిష్యత్తు కోసం ఇచ్చిన ఆయుధాలివి. బాగా చదవండి, లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగండి. మంచి ర్యాంకు సాధించండి… మీ విజయమే మీ కుటుంబానికి, గ్రామానికి గౌరవం తీసుకురస్తుంది,” అంటూ ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు.విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో కొత్త విద్యాసంవత్సరానికి ఉత్తేజాన్ని కలిగించినట్టు పాఠశాల సిబ్బంది తెలిపారు