

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- స్థానిక పురపాలక సంఘం లో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న,గుడిసె యేసు రత్నం అనే పారిశుద్ధ కార్మికుడు విధులు నిర్వహిస్తూ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మరణించారు.ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీ హరిబాబు వారి నివాసం వద్ద ఉంచిన పార్థివ దేహానికి పూల మాలను వేసి నివాళులు అర్పించారు.అనంతరం కార్మికుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.