

జనం న్యూస్ జనవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ఆర్టిఏ కూకట్పల్లి యూనిట్ కార్యాలయం అధికారులు.. ట్రాఫిక్ పోలీసులు పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. కెపిహెచ్బి నాలుగో రోడ్ లోని గ్లోబల్ ఎడ్జ్ పాఠశాలలో గురువారం జాతీయ రహదారి భద్రత మాచోత్సవాల పేరిట విద్యార్థులకు ఎంవీఐ శ్రీనుబాబు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. మరో కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి ఆర్టిఏ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాటలడుదుతూ ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించటానికి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు , ట్రాఫిక్ ఎస్ఐ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు