Listen to this article

జనం న్యూస్- జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- ఉన్నత పాఠశాల అనేది విద్యార్ధి జీవితంలో ఒక కీలకమైన సమయమని విద్యాపరమైన సవాళ్లు, వ్యక్తిగత ఎదుగుదల, భవిష్యత్తు ఆకాంక్షల అన్వేషణ ద్వారా గుర్తించబడుతుందని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రత్యేకణాత్మక ఉపన్యాసకులు శ్రీనాథ్,రంజిత్,సుధాకర్ లు హాజరయ్యారు. ఈసందర్భంగా గురువారం స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రేరణత్మక సదస్సు లో వారు మాట్లాడుతూ. హైస్కూల్ విద్యార్థుల కోసం రూపొందించిన ఈ ప్రేరణాత్మక ప్రసంగాలు విద్యార్థి అభ్యసనంలో అడ్డంకులను అధిగమించడానికి, వారి వృద్ధికి కావలసిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇవిదోహదపడతాయని అన్నారు.ఈ ప్రసంగాలు టీనేజ్ అనుభవానికి సంబంధించిన నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవడం, అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్న వైఫల్యాలను విజయానికి సోపానంగా స్వీకరించాలని అన్నారు. ఇవి విద్యార్థి జీవితంలో వారు దృఢ నిశ్చయంతో విజయపథంలో పయనించేలా వారిని శక్తివంతం చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాధవి లత పాఠశాలఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.