Listen to this article

(జనం న్యూస్ – జూన్ 14, నెల్లికుదురు) నెల్లికుదురు మండలం కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ (ఎం) ధర్నా నిర్వహించిన అనంతరం సిపిఎం మండల కార్యదర్శి ఇసంపేల్లి సైదులు పాల్గొని మాట్లాడుతూ భారీ అకాల వర్షాలతో తెగిపోయిన రావిరాల. రాజుల కొత్తపల్లి. ఆలేరు చెరువు కట్టలను మరమ్మత్తులు చేయాలని సిపిఎం నెల్లికుదురు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేయడం జరిగింది.గత సంవత్సరం భారీ అకాల వర్షాల వలన తెగిపోయిన చెరువు కట్టలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చెరువు కట్టలు తెగటం వలన కోట్లాది రూపాయలు రైతాంగానికి నష్టం జరిగిందని ఇట్టి చెరువు కట్టలను తక్షణమే పూర్తి చేసి వర్షాకాల పంటలకు నీరు అందేలా ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు దీనివలన వ్యవసాయ ఆధారిత వర్గాలు పూర్తిగా నష్టపోతాయని ఇప్పటికీ గ్రామాల్లో రైతాంగం బ్రతుకుతెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళుతున్నారని వ్యవసాయ కూలీల బతుకు వర్ణ వర్ణనాతీతం అని అన్నారు.రావిరాల గ్రామ చెరువు కట్ట తెగటం వలన దీని కింద పారకం రావిరాల మదంతుర్తి మునిగల వేడు మరియు జయపురం శివారు వరకు నీటి పారుదల ఉంటుందని తక్షణమే తెగిపోయిన చెరువు కట్టలను మరమ్మతులు చేపట్టాలని లేనియెడల రాజుల కొత్తపల్లి రావిరాల ఆలేరు గ్రామ రైతాంగాన్ని ఐక్యం చేసి రైతాంగ పోరాటాలను చేస్తామని తక్షణమే ప్రభుత్వం స్పందించి చెరువు కట్టల మరమ్మత్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పెరమాండ్ల బాబుగౌడ్,తోట యాకన్న,తోట నరసయ్య, బాణాల యాకన్న, పెరుమాండ్ల పుల్లయ్య,భూక్య బిక్షపతి,ఐలేష్,రవి,కొట్టం వెంకన్న,రైతులు తదితరులు పాల్గొన్నారు…