

జనంన్యూస్ 17జూన్ పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలోని పనులలో భాగంగా కోళ్ల ఫారం మరియు పశువుల కొట్టం (పౌల్ట్రీ ఫార్మ్& క్యాటిల్ షేడ్) లకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస్ రెడ్డిమార్కౌట్( ముగ్గుపోయడం)ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మహేందర్ టెక్నికల్ అసిస్టెంట్ రాజేశం గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ క్షేత్ర సహాయకులు మల్లేశం, కారోబార్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.