

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం విభా ఏరుడైట్ స్కూల్ కు చెందిన హనుమంతు పూర్విజా CAYD సబ్ సెంటర్ నందలూరు నుండి ఫాస్ట్ బౌలింగ్ లో శిక్షణ పొందుతూ మంచి క్రమశిక్షణ తో శ్రమించి ప్రాక్టీస్ చేస్తూ జిల్లా జట్టుకు ఎంపికై తన ఫాస్ట్ బౌలింగ్ తో నెల్లూరు జిల్లాలో జరిగిన జిల్లా క్రికెట్ మ్యాచ్ లలో నెల్లూరు,అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లలో అన్ని జిల్లాల మీద మంచి వికెట్లు సాధించి అనతి కాలంలోనే అండర్-15 విభాగం లో “ఆంధ్రా సౌత్ జోన్ ” జట్టుకు ఎంపిక కావడం జరిగినది. సౌత్ జోన్ జట్టుకు ఎంపికై నందుకు CAYD నందలూరు క్రికెట్ సబ్ సెంటర్ కోచ్ లు ఇంఛార్జి కోచ్ గయాజ్, కోచ్ ఫిరోజ్ ఖాన్ లొడి, ట్రైనర్ శివ కోటి,గ్రౌండ్స్ మెన్ హరి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు, అలాగే CAYD ప్రెసిడెంట్ భరతరెడ్డి,సెక్రెటరీ రెడ్డి ప్రసాద్ కి,DCO ఖాజమైనుద్దిన్ కి మరియు ఊమెన్ క్రికెట్ కోఆర్డినేటర్ విష్ణు మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేసారు.