Listen to this article

జనం న్యూస్ జనవరి 23 జిల్లా బ్యూరో:- రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీలు విద్యార్థులలో విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి దోహదపడతాయని అలాగే విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు ఉపారపు సత్యరాజ్ అన్నారు.అంబేద్కర్ జీవిత చరిత్ర, భారత రాజ్యాంగం, స్వతంత్ర సమరయోధుల చిత్రాలకు సంబంధించిన అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తo 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం రోజున ప్రథమ ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించేందుకు రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని మండల విద్యాధికారి ఉదయ్ రావ్ ప్రధానోపాధ్యాయులు దేవిదాస్ అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాందేవ్, వినేష్,జయంతి, సొసైటీ సభ్యులు అతీష్ కాంబ్లె, చట్ల సంతోష్,సీఆర్పి సావీందర్ తదితరులు ఉన్నారు