Listen to this article

రైతన్నలు విత్తనం విత్తుకునే సమయం ఆసన్నమయిన ప్రభుత్వం కొనుగోలు చేసిన జొన్నల డబ్బులు అందకాపాయే

జనం న్యూస్,జున్ 17,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రైతన్నలు జొన్న పంట సాగుచేసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీల ద్వారా కొనుగోలు చేసిన జొన్నల డబ్బులు సుమారు రెండు నెలలు కావస్తున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో, రైతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రైతన్నలు పంటలు వేసుకునే సమయం ఆసన్నమయినందున విత్తనాలు,మందు సంచులు కొనుగోలు చేసుకోడానికి రైతుల పండించిన జొన్నలు సొసైటీకి విక్రయించిన డబ్బులు సరైన సమయానికి రైతుల ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు.దుక్కి దున్నిన ట్రాక్టర్ డబ్బులతో పాటు,విత్తనాలు కొనుగోలు చేసే కేంద్రాల వద్ద డబ్బులుంటే కానీ మందులు,విత్తనాలు ఇవ్వని దుస్థితి చెవిచూడవల్సి వస్తుందాని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి డబ్బులు సత్వరగతిన జమ చేసే దిశగా చొరవ తీసుకోవాలని రైతన్నలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దత్తు రావు,అంజయ్య చారి, చాకలి సాయిలు,గొల్ల పండరీ,వెంకట్ రెడ్డి, కిష్టాన్న,సురేష్,రాములు,గొల్ల శ్రీనివాస్,సురేష్, వెంకట్ రావు, అంజయ్య,మల్లన్న, ప్రకాష్ రావ్,తదితరులు పాల్గొన్నారు.