

(జనం న్యూస్ చంటి జూన్ 17)
ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని దొమ్మాట గ్రామంలో సైబర్ నేరాల మీద దౌల్తాబాద్ ఎస్సై శ్రీ రామ్ ప్రేమ్ దీప్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించుకోవాలి దానివల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్ టైం లో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి గొడవలలో ఇన్వాల్వ్ కావద్దు గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యావాదాలు చెప్పడం జరిగింది ఇందులో పాల్గొన్నవారు హెడ్ కానిస్టేబుల్ విక్రమ్ రెడ్డి పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
