Listen to this article

జనం న్యూస్. జనవరి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా జెడ్పి సీఈవో జానకి రెడ్డి అన్నారు, గురువారం హత్నూర మండల పరిధిలోని నస్తీపూర్, గుండ్ల మాచునూర్ , ఎల్లమ్మ గూడెం, వడ్డేపల్లి, నవాబ్ పేట, హత్నూర గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు,నస్తీపూర్ గ్రామంలోని గ్రామ సభలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి హాజరయ్యారు,గుండ్ల మాచునూర్ గ్రామంలోని గ్రామసభలో డిప్యూటీ జెడ్పి సీఈవో స్వప్న, రెడ్డి ఖానాపూర్ గ్రామసభలో తాసిల్దార్ పర్వీన్ షేక్. ఎల్లమ్మ గూడ, గ్రామసభలో ఎంపీడీవో శంకర్ స్పెషల్ ఆఫీసర్ వెటర్నరీ డాక్టర్ సంధ్య ,వడ్డేపల్లి గ్రామసభలో ఏ ఈ ఆర్డబ్ల్యూఎస్, శ్రీనివాస్, నవాబుపేట గ్రామసభలో, ఏఈ శ్రీనివాసరావు, హత్నూర గ్రామ సభలో ఇరిగేషన్ ఏఈ భూపుత్ర , పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు, గ్రామంలో అందరూ కలిసిమెలిసి సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు, ప్రభుత్వం అందించనున్న నాలుగు సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, రైతు భరోసా, అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు , అర్హులైన లబ్ధిదారుల పేర్లు లిస్ట్ లో లేకున్నా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు యువకులు, పాల్గొన్నారు,

హత్నూర గ్రామసభలో రసాభస

మండల కేంద్రమైన హత్నూర గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన గ్రామసభ రసాబసాగా కొనసాగింది. అటు గ్రామస్తులు ఇటు అధికారుల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నెలకొంది. గత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా అసలైన లబ్ధిదారుల పేర్లు లేకపోవడంతో గ్రామస్తులు మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులను నిలదీశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలంటూ ప్రజలను మాయ మాటలతో మభ్యపెడుతూ పక్కదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో. హత్నూర ప్రత్యేక అధికారి భూపుత్ర. ఏ ఈ ఓ రమేష్. పంచాయతీ కార్యదర్శి చింతకాయల మహేష్. ఫీల్డ్ అసిస్టెంట్ రవి. మాజీ సర్పంచులు. ప్రజా ప్రతినిధులు. గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు