

జనం న్యూస్ 18జూన్ పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో ఎస్సి ఎస్టీ మైనారిటి, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏఎమ్ సి చైర్మన్ మరియు మండల నాయకుల ఆధ్వర్యంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను 93 మంది లబ్దిదారులకు 28,22,500/-విలువగల చెక్కులను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలొ నాయకులు మాట్లాడుతూ తెలంగాణలొ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఉండడం వలన ఆరోగ్యశ్రీ ని గతంలోఐదు లక్షలు ఉంటె ఇప్పుడు పది లక్షలు పెంచడం జరిగిందని అంతేకాకుండా ఇంకా మెరుగైన వైద్య సేవల కొరకు అదనపు ఖర్చులు భరించియెడల వారు ముఖ్యమంత్రి సహన్నిధికి దరఖాస్తు చేసున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరుగుతుందని పేదవారికి ఆర్ధిక బరోసా కల్పించి ప్రతిఒక్కరికి లబ్ది చేకూరాల్లనేదే ప్రభుత్వ ద్యేయమన్నారు.. ఈకార్యక్రమంలో ఏఎమ్ సి చైర్మన్ మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, యూత్ మండల అధ్యక్షులు పురుషోత్తం అనిల్ గౌడ్,ఉపాధ్యక్షులు సంధి మల్లారెడ్డి, తడగొండ రాజు, బండారి శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి డైరెక్టర్ చాట్ల భాస్కర్, సీనియర్ నాయకులు, పూసాల తిరుపతి, కడారి తిరుపతి, సింగసాని స్వామి, ఎల్లగొండ కృష్ణ హరి,అమెరిశెట్టి లక్ష్మీనారాయణ, డైరెక్టర్లు చేట్ల కిషన్, ఆడుప తిరుపతి,తౌటు గంగాధర్, దేశెట్టి లక్ష్మి రాజాం,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి కొండం మధుసుదన్, జిల్లా యూత్ నాయకులు బొమ్మగోని జితేందర్ గౌడ్ బొడ్డు రమేష్,ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి,గర్వాంద రమేష్ గౌడ్,కుంచె రాజేందర్,సతీష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు..