

జనం న్యూస్ – జూన్ 17- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-
నాగార్జునసాగర్ హిల్ కాలనీ కు చెందిన డాక్టర్ గారపాటి కిషోర్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ సర్జన్ గా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. హిల్ కాలనీలో జన్మించిన కిషోర్ పాఠశాల విద్యను స్థానిక ప్రభుత్వ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పూర్తి చేసి కళాశాల విద్యను స్థానికంగానే ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో పూర్తిచేసి మెడిసన్ లో మంచి ర్యాంకుతో డాక్టర్ విద్యను పూర్తి చేసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతని తండ్రి గారపాటి జోజి స్థానికంగా ఒక సాధారణ టైలర్ గా జీవితాన్ని కొనసాగిస్తూ తమ పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో తను చేసిన కృషి అంతా ఇంతా కాదు. ప్రవేట్ ప్రాక్టీస్ తొ డబ్బులు సంపాదించే అవకాశం ఉన్నా కూడా పేద మధ్యతరగతి ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో సర్జన్ గా జాయిన్ అయి గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన వైద్య సేవ లతో పాటు కార్పొరేట్ స్థాయి శస్త్ర చికిత్సలను చేరువ చేసిన డాక్టర్ గారపాటి కిషోర్ కుమార్ కు ఈ అరుదైన పురస్కారం దక్కింది. లక్షల రూపాయల వ్యయమయ్యే వివిధ రకాల శస్త్ర చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందిస్తున్న జనరల్ సర్జన్ కిషోర్ సేవలను గుర్తించి సుమన్ టీవీ హైదరాబాద్ వేదికగా నిర్వహించిన వేడుకల్లో
డాక్టర్ గారపాటి కిశోర్ ఈ అవార్డును అందుకున్నారు డాక్టర్ కిషోర్ కుపురస్కారం దక్కడంతో సహచర వైద్యులు, గ్రామస్థులు, చిన్ననాటి స్నేహితులు ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు.