

వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించిన వైసీపీ నేతలు
జనం న్యూస్,జూన్17
అచ్యుతాపురం: అచ్యుతాపురం వైసీపీ కార్యాలయం నందు ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకర రావు మాట్లాడుతూ 2019 నుండి 2020 వరకు జగనన్న అంటే నమ్మకం, 2024 నుండి 2025 వరకు చంద్రబాబు అంటే మోసమని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శాంతి సురక్షిత పటిష్టంగా, లాండ్ ఆర్డర్ నిబద్ధత సంకల్పం సంక్షేమం, సమగ్ర అభివృద్ధి,అధికార వికేంద్రీకరణ,గ్రామ స్వరాజ్యం,ఇంటిఇంటికి సేవలు పారదర్శకత వినూత్న విప్లవాత్మక విద్య, వైద్యం, వ్యవసాయం,మహిళా అభ్యుదయం,సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని,చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరకాలంలో కేవలం రెడ్బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే నడిపిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ, దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ ఇచ్చిన హామీలను తుంగలు తొక్కుతూ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రశ్నించిన వారిపై అణిచివేత ధోరణి మానుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకు మధ్య తేడాను వివరిస్తూ వెన్నుపోటు పుస్తకాన్ని వైసీపీ నేతలు ఆవిష్కరించడమైనదని అన్నారు. రెండు రోజుల క్రితం ఒక దినపత్రికలో ఎలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున వలసలు అని వార్త ప్రచురించడమైనది. దీనిపై స్పందిస్తూ రాజకీయాల్లో వలసలనేవి సర్వసాధారణమని, కొంతమంది వ్యక్తులు తమ స్వలాభం కోసం స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ఉంటారని,2019 ఎన్నికల అనంతరం ఈ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జరిగాయని,గతాన్ని గుర్తు చేసుకోవాలని మరో సంవత్సరకాలం తర్వాత నుండి కూటమి పార్టీల నుండి మళ్లీ పెద్ద ఎత్తున వలసలు వైసీపీలోకి జరుగుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోన సంధ్యా బుజ్జి , జడ్పిటిసి లాలం రాంబాబు, కో జెడ్పిటిసి నల్మాల కుమార్, సర్పంచ్లు మారిశెట్టి సూర్యనారాయణ,సర్పంచ్ విమలా నాయుడు,పంచదార్ల పైడి రాజు, వైస్ ఎంపీపీ వాసుపల్లి శ్రీనివాస్, నియోజవర్గ యువజన విభాగ అధ్యక్షులు బుజ్జి, మండలం యువజన విభాగం అధ్యక్షులు గంగులీ, అచ్యుతాపురం గ్రామ అధ్యక్షులు పంచదార్ల రవి,ఉమ్మడి జగన్ మరియు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.