

జనం న్యూస్ 18 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ విడుదల చేసిన పుస్తకాలను చెత్తబుట్టలో వేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు మంగళవారం విజయనగరంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు విడుదల చేసిందని తెలిపారు. త్వరలో అన్నదాత సుఖిభవ పథకం క్రింద రైతులను ఆదుకోబోతుందని పేర్కొన్నారు.