Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం జూన్ 18.

ఈరోజు తర్లపాడు మండలం లక్ష్మక్కపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి.జగన్ బాబు లక్ష్మక్క పల్లి నుండి జగన్నాధపురం బదిలీ అయిన సందర్భంగా లక్ష్మక్క పల్లి గ్రామ ప్రజలు జగన్ బాబు చేసిన సేవలు కొనియాడుతూ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ పోలిచెర్ల వినోద్ కుమార్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ పెరిక సుందర్ కుమార్ తల్లిదండ్రులు చాగలమర్రి ప్రకాష్.చాగలమర్రి పేతురు. ఇండ్ల మరియదాసు ,కిషోర్,సుగుణ,దాసు,శ్రీలీల.భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి,కృష్ణా రెడ్డి,నవీన్, జైపాల్,కాలూరి శ్రీను,ఇంకా చాలామంది గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పాస్టర్ చాగలమర్రి ప్రకాష్ మాట్లాడుతూ జగన్ సారు పాఠశాలను చాలా అభివృద్ధి చేశారు.2021 జనవరి లో ఇక్కడికి వచ్చి అద్వాన స్థితి లో ఉన్న పాఠశాలను అధ్భుతంగా తీర్చిదిద్దారు. గ్రామ ప్రజలతో మమేకమై మా పిల్లలందరూ చదువుకు బాగా కృషిచేశారు.తన సొంత నిధులతో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు.అలాగే నిరంతరం సమాజసేవలో నిమగ్నమై ఉంటారు. అలాంటి ఎన్నో సేవలు అందించిన జగన్ సారు బదిలీ కావడం మా గ్రామస్తులందరికీ చాలా బాధాకరం, ఆయన సేవలు ఎల్లప్పటికీ గుర్తుండిపోతాయి అని తెలియజేశారు. గ్రామ పెద్ద రాజారావు మాట్లాడుతూ నా40 సంవత్సరాల సర్వీసులో ఇలాంటి అంకితభావం గల ఉపాధ్యాయుడు రావడం మా ఊరు ప్రజలు చేసుకున్న అదృష్టమని కొనియాడారు. అలాగే ఉపాధ్యాయుడు అబ్దుల్ షుకూర్ సార్ మాట్లాడుతూ జగన్ సారు ఏ స్కూల్ కి వెళ్ళిన పూర్తిస్థాయిలో పాఠశాలను అభివృద్ధి చేస్తారు. అంతేకాకుండా సామాజిక బాధ్యత గా ప్రజాసేవలో కూడా నిరంతరం నిమగ్నమై ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన ఉపాధ్యాయుడు శ్రీహరి విద్యార్దులు పాల్గొన్నారు.