

జనం న్యూస్ తర్లుపాడు మండలం. జూన్ 18
మార్కాపురం పట్టణంలోని స్విమ్స్ హాస్పిటల్ నందు తుమ్మలచెరువు గ్రామానికి చెందిన షేక్ నన్నెవలి ఈ నెల 11వ తేదీన జగనన్న పోరుబాట కార్యక్రమం సందర్భంగా ప్రమాదానికి గురికావడం తో హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్సీపీ సమనవ్యకర్త అన్నా రాంబాబు పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమం లో వైసిపీ నాయకులు సూరెడ్డి సుబ్బారెడ్డి, కేతగుడిపి సర్పంచ్ దూదేకుల పెద్ద మస్తాన్, మురారి వెంకటేశ్వర్లు, రాగసముద్రం సర్పంచ్ తాడి రమణారెడ్డి, దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు